27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు వేగవంతం  

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో అభివృద్ధి 

 

. . . మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ షట్కార్ పరిశీలన

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే జుక్కల్ నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో బిచ్కుంద పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ రోడ్డు అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పనులను సోమవారం మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ షట్కార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు లెవలింగ్, లైటింగ్ ఏర్పాట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువ వికాసం వంటి పథకాలను నియోజకవర్గ  వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, రాత్రి సమయంలో సురక్షిత ప్రయాణం కోసం సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Central lighting road work in Bichkunda accelerated

More articles

Latest article