24 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్డీవో కి వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రవీందర్ రెడ్డిని కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు కౌన్సిలర్లు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని, వెంచర్లలో బఫర్ జోన్ తో పాటు, ప్రభుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంట కాలువలను తొలగించారని వినతి లో పేర్కొన్నారు. ఆ వెంచర్ ఏర్పాటు చేసిన యాజమానులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌డీవోను కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

More articles

Latest article