26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నసురుల్లాబాద్ రహదారిపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని నసురుల్లాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారో నిర్వహించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ… నిన్న సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్ట్ నుండి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురాలేదని ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్, కేటీఆర్ , హరీష్ రావు ను తప్పుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలే వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరించారు.

More articles

Latest article