నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో దీర్ఘకాలంగా ఇబ్బందిగా మారిన రోడ్డు గుంతలను పూడ్చే పనిని గ్రామపంచాయతీ చేపట్టింది. వర్షాల వల్ల, రవాణా వాహనాల రాకపోకల వల్ల ఏర్పడిన గుంతలతో స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. జేసీబీ యంత్రం, ట్రాక్టర్ల సహాయంతో గ్రామంలోని ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను కంకర, మట్టితో పూడ్చి, రోడ్డు మరమ్మతు పనులు వేగంగా చేపడుతున్నారు. ఈ పనులను గ్రామపంచాయతీ సిబ్బంది, కూలీలు స్వయంగా పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనితో స్థానికులకు, వ్యాపారులకు, వాహనదారులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా తగ్గనుంది. గ్రామపంచాయతీ చేపట్టిన ఈ చొరవను స్థానికులు ఆహ్వానిస్తూ, ఇలాంటి అభివృద్ధి పనులు మరిన్ని చేపట్టాలని కోరుతున్నారు.

