24 C
Hyderabad
Sunday, August 2, 2026

మెరుగైన అత్యవసర సేవలే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విజయవంతంగా ముగిసిన 108 ఉద్యోగుల శిక్షణ తరగతులు

 

. . . ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ శిక్షణలో అత్యవసర వైద్య సేవలు, శిశు సంరక్షణ, సీపీఆర్, ప్రథమ చికిత్స, ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించే విధానాలపై నిపుణులు ప్రాక్టికల్ డెమోతో పాటు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్  జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, ఇన్స్ స్ట్రక్టర్ ప్రమోద్, నిజామాబాద్ జిల్లా కో ఆర్డినటర్ స్వరాజ్, కామారెడ్డి జిల్లా కో ఆర్డినెటర్ తిరుపతి, 108 సిబ్బంది సంతోష్ రెడ్డి, శేఖర్ గౌడ్, లక్ష్మణ్, హఫీజ్, శ్రీనివాస్,కిషన్ ,విజయ్, అరుణ్, భీంరావ్, రూపేష్, అకేశ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article