29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్ఐఆర్ ఓటరు జాబితా నవీకరణలో అత్యంత కీలకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటరు జాబితా నవీకరణలో అత్యంత కీలకమైనదని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని 42, 41, 40, 17, 11, 8, 27, 34 డివిజన్‌లలో ప్రత్యేక ఓటరు సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నాయకత్వం వహించగా, ఎస్ఐఆర్ ప్రక్రియ అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారమ్‌ను నింపి సమర్పించాలని, గత 2002 ఓటరు జాబితాలో ఉన్న వివరాలకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు.

 

SIR is crucial for the voter list update.

 

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు తమ పరిధిలోని బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు నింపడంలో సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అలాగే బిఎల్ఏ సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన డివిజన్‌లలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు సంబంధిత బిఎల్ఓ లకు అవసరమైన సహకారం అందించాలని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బిఎల్ఏ సూపర్‌వైజర్లు అవీన్, సాయి బసవ, శివ చరణ్, బంటు బలరాం, శోభన్, లవంగ ప్రమోద్‌తో పాటు డివిజన్ ఇన్‌చార్జిలు రమేష్, అన్వర్, కరీముద్దీన్, సాయిలు, నరేందర్, ప్రవీణ్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

SIR is crucial for the voter list update.

More articles

Latest article