25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

మండలంలోని వివిధ గ్రామాల్లోని పలు భాదిత కుటుంబాలను స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని జానకంపేట గ్రామంలో జేమ్స్ కు ఇటీవల ఆపరేషన్ కావడం వాళ్ళ వారిని వారి కుటుంబ సభ్యులను మానాల పరామర్శించారు. పడగల్ గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన జల్లెళ్ల అశోక్ ను,  వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇటీవల కిడ్నీ సమస్యతో మరణించిన పోతూరి అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించారు. కంకల ప్రశాంత్ ఇటీవల మరణించారు వారి కుటుంబంని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల ప్రెసిడెంట్ అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, పడగల్ గ్రామ సర్పంచ్ రాజు, కుకునూరు గ్రా సర్పంచ్ భూమారెడ్డి, జానకంపేట ఉపసర్పంచ్ వినోద్, గ్రామ శాఖ అధ్యక్షుడు సౌడ శ్రీను, గాడేపల్లి గంగారెడ్డి  కిశోర్ గౌడ్,ఏలేటి రాజేందర్,గుడాల మోహన్, ఇంద్ర గౌడ్,దొరబాబు, నవీన్, నిరాజ్, జాన్ ముంబయి, గంగాధర్, రాజేష్, సాగర్, సంతాయా, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article