26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జడ్పీహెచ్ ఎస్ లో బ్యాగులు పంపిణి చేసిన కల్లెడ అశోక్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు కల్లెడ అశోక్ బోర్గాం (పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న విద్యార్థులకు గురువారం స్వయంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్లెడ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చని అన్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కల్లెడ అశోక్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆనందంగా స్కూల్ బ్యాగులను స్వీకరించి కల్లెడ అశోక్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

Kalleda Ashok distributed bags at ZPHS.

More articles

Latest article