జడ్పీహెచ్ ఎస్ లో బ్యాగులు పంపిణి చేసిన కల్లెడ అశోక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు కల్లెడ అశోక్ బోర్గాం (పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న విద్యార్థులకు గురువారం స్వయంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్లెడ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చని అన్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కల్లెడ...