28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం జులైలో రైతుబంధు నిధులను అందిస్తున్న తరుణంలో జూన్ 5 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. ప్రతి ఒక రైతు ఈ కేవైసీ తో పాటు నూతనంగా పట్టా పాసుబుక్కులు పొందిన వారు ఏఈఓ ద్వారా గాని అగ్రికల్చర్ అధికారి కార్యాలయంలో గాని దరఖాస్తు సమర్పించుకోవాలి అన్నారు. నూతన పట్టా పాసుబుక్ తో పాటు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, తదితర వివరాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే ఈ కేవైసీ చేసుకొని రైతులు ఈ నెల ఆఖరి కల్లా చేసుకోవాలని సూచించారు. లేని యెడల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. కావున రైతులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇందల్వాయి మండలం వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచించారు.

More articles

Latest article