* మద్యం అమ్మినా.. సేవించినా రూ.50వేల జరిమానా
* గ్రామ పెద్దలు, యువకుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం
బాన్సువాడ, బతుకమ్మ: కుటుంబ వ్యవస్థను, ఆర్థిక స్థితిగతులను చిన్నభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని గ్రామం నుంచి తరిమికొట్టాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట్ గ్రామస్తులు నిర్ణయించారు. మద్యం విక్రయించినా, సేవించినా రూ.50వేల జరిమానా విధించాలని తీర్మానించారు. మద్యం సేవిస్తున్న వారు మత్తులో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని, తమ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, ఇందుకోసం సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామ పెద్దలు, యువకులు నిర్ణయానికి వచ్చారు. మద్యం సేవించడం కారణంగా చోటుచేసుకునే పరిణామాలను గ్రామస్తులకు వివరించారు. అంతా ఏకమై గ్రామంలో మద్య నిషేధం ప్రకటించారు. ఎవరైనా మద్యం తాగినా, అమ్మినా రూ.50 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. మధ్యం నిషేధం ఈనెల 21(సోమవారం) ఉదయం 6గంటల నుంచి అమలు చేయనున్నారు.
