27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నిండు జీవితానికి రెండు చుక్కలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యమే గ్రామ ప్రగతికి మూలమని, పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టడానికి 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డా. అయోషా సిద్ధిఖ, ఉప సర్పంచ్ నిసార్, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Two drops for a full life.

More articles

Latest article