27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొత్తబాదిలో తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కొత్తబాది గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వార్డుల్లో సింగిల్ ఫేజ్ మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ, సరైన నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మోటార్లు పనిచేయకపోవడం, మరమ్మతులు ఆలస్యం కావడం వల్ల అనేక కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని సంబంధిత అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, సింగిల్ ఫేజ్ మోటార్ల మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే గ్రామంలో ఉన్న ఇతర తాగునీటి సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article