కొత్తబాదిలో తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

  బాన్సువాడ, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కొత్తబాది గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వార్డుల్లో సింగిల్ ఫేజ్ మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ, సరైన నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మోటార్లు పనిచేయకపోవడం, మరమ్మతులు ఆలస్యం కావడం వల్ల అనేక కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని...