25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్సై సతీష్

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలోని బషీరాబాద్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నివారణ, అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించి డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల వ్యక్తిగత జీవితం నాశనం అవుతుందని, కుటుంబాలకు కుటుంబాలు ఎలా దెబ్బతింటాయో విద్యార్థులకు వివరించారు.మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article