29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సాయి ఆయుష్ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి లోగల సాయి ఆయుష్ చిన్న పిల్లల ఆస్పత్రిలో నవజాత శిశువు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గంగామణి సంతానమైన ఫ్రీ మెచ్యూర్ డెలివరీ ఐన బాలుడిని వైద్యం కోసం సాయి ఆయుష్ పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు.

Newborn died in Sai Ayush hospital

నెలలు తక్కువగా ఉండగానే జన్మించడంతో నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఆస్పత్రిలో వైద్యం కోసం మూడు లక్షల వరకు వెచ్చించిన బాలుడు ప్రాణం దక్కలేదు. తమ చిన్నారి ఆరోగ్యంగా వస్తాడని డబ్బులు ఖర్చు చేసిన వైద్యుల కారణంగా అప్పుడే పుట్టిన శిశువు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. వారికి తాఢ్ బిలోలీ గ్రామస్తులు తోడయ్యారు. గ్రామస్తులకు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాల్సిన వైద్యుడు సంకీర్త్ రావు అక్కడినుంచి వెళ్లిపోయాడు. దానితో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్స్ స్ఫూర్తి వైద్య లోపం లేదని నవజాత శిశువు ఆరోగ్య సమస్యలతోనే చనిపోయాడని వివరణ ఇచ్చారు.

Newborn died in Sai Ayush hospital

More articles

Latest article