28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మంచిర్యాల కేంద్రంగా టీఆర్ఎస్ రాజకీయాలు కొనసాగిస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గించే కుట్ర జరుగుతుంది

 

. . . మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరి మానుకోవాలి

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

మంచిర్యాల, బతుకమ్మ :

 

మంచిర్యాల నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తానని, జిల్లా ప్రజల ఆదరణతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల దవిత ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన కవిత, ఓపెన్‌కాస్ట్ గనుల పేరుతో ఉపాధి అవకాశాలను కుదిస్తున్నారని అన్నారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్‌ను ప్రోత్సహిస్తే ఉత్పత్తి పెరగడంతో పాటు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే సింగరేణి నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సరైన వసతులు, ప్రమోషన్లు కల్పించడం లేదని, అధికారులు ఒక విధంగా, కార్మికులపై మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, వాటిని తెలంగాణలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం మరిన్ని కోల్ బ్లాకులు కేటాయించేలా కృషి చేయాలని సూచించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఉద్యోగాలు, గృహ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి కార్మిక కుటుంబానికి 250 గజాల స్థలం అందించే విధానం అమలు చేస్తామని తెలిపారు. గుజరాత్ మినరల్స్ కార్పొరేషన్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యేక మైనింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఎండీవో విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. సింగరేణి ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానం తీసుకువస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన కవిత, ఎమ్మెల్యే గుండాగిరి బంద్ చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రజలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని పేర్కొన్నారు.

 

I will continue TRS politics with Mancherial as the base.

More articles

Latest article