23.7 C
Hyderabad

జాకోర – చందూర్ఎత్తిపోతల ప్రారంభానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ రాక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 వర్ని,బతుకమ్మ:

వర్ని మండలం లో నిర్మించిన జాకోర – చందూర్ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 10 న రూ.106 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు లు పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటనలో ఎలాంటి పొరపాట్ల కు తావు లేకుండా చూడాలని అధికారులను సమీక్షలో పోచారం సూచనలు చేశారు. పోచారం వెంట వర్ని ,చందూర్ మండలాల  ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Water Minister Uttam arrives for the inauguration of the lift irrigation scheme

More articles

Latest article