30.9 C
Hyderabad
Monday, August 3, 2026

యువత వారి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్నేహ సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం

 

వేల్పూర్, బతుకమ్మ :

 

యువత వారి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలని వేల్పూర్ ఏపిఎం బత్తుల మాణిక్యం అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని లక్ష్యం వైపు అడుగు వేసి ఉన్నత స్థానంలో స్థిరపడాలని పేర్కొన్నారు. శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని మహిళా సమైఖ్యా భవనంలో స్నేహ సంఘాలలో సభ్యులుగా ఉన్న కిశోర బాలికల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మహిళా సమైఖ్యా అధ్యక్షురాలు సరోజిని, సీసీలు లక్ష్మీ,  సునీత, కిశోర బాలికల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article