సిరిసిల్లా, బతుకమ్మ :
సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు మంగళవారం పైనాన్స్, వడ్డి వ్యాపారుల ఇండ్లలో, దుకాణాలలో సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అక్రమ వడ్డీ, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశారు. ఈ సంధర్బంగా తనిఖీలలో రూ.1,42,05,000 విలువ గల వివిధ డాక్యుమెంట్లు, రూ.1,77,000 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించడం, అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

