నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ఐదుగురు ప్రమోషన్ పొంది సోమవారం సీపీ ని కలిసారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎండి. ఖలీద్, డి.గౌరీ శంకర్, బి.శివ కుమార్, బి. దూప్ సింగ్, టి శ్రీనివాస్ లకు ప్రమోషన్ వచ్చినట్టు సీపీ తెలియజేశారు.
