24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీసీ ల ఆశాకిరణం, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు & బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి కొట్టుర్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహనీయుల ప్రాంగణం విగ్రహాల పార్క్ వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద అర్చన చేసి, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులలో ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఇటీవలే రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన శేఖర్ గౌడ్ ని శాలువా, బొకే లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుజాత శ్రీశైలం, నరేందర్ గౌడ్, రామగిరి శ్రీనివాస్, గట్ల శ్రీనివాస్, నరేష్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article