. . . నందిపేట్‌లో స్టీల్ బ్యాంక్ ప్రారంభం
నందిపేట, బతుకమ్మ :
నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్, గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ఆధ్వర్యంలో గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని మానేయాలని అవగాహన కల్పించే ఉద్దేశంతో “స్టీల్ బ్యాంక్”ను ప్రారంభించారు. సుమారు ఐదు వేల స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఈ స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు తమ శుభకార్యాలకు వీటిని తీసుకెళ్లి వినియోగించిన అనంతరం తిరిగి అప్పగించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా కారణమవుతుందని అవగాహన కల్పించారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వస్తువులు వినియోగించాలని ఆయన కోరారు.

