29.9 C
Hyderabad

అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ కు మలి దశ ఉద్యమకారుల వినతి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్ట వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టి జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లకు సిద్ధం చేయాలని బాన్సువాడ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ ఖయ్యుం కు మలి దశ ఉద్యమకారులు జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్, మండల అధ్యక్షుడు గంజి వారి చంద్ లు ఆదివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల స్థూపానికి వాల్ పోస్టర్లు ఇతరత్రా పోస్టర్లు అందించి అమరుల రూపాన్ని అవమాన పరుస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి కమిషనర్ కు వారు కోరారు. అలాగే జూన్ రెండవ తేదీ వరకు అమరవీరుల స్థూపాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయాలని స్తూపం చుట్టూ ఏర్పాటు చేయాలని వారు కోరారు. అమరవీరుల స్థూపానికి ఎవరైనా పోస్టర్లు అతికించితే వారికి జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఇన్ చార్జి కమిషనర్ ఖయ్యూం అమరుల స్థూపాన్ని మరమ్మతులు చేయించి ముస్తాబు చేస్తామని ఏర్పాట్లు అన్ని విధాలుగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

More articles

Latest article