27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీఎస్ సీఐ పై క్రిమినల్ కేసు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

 ఖమ్మం, బతుకమ్మ:

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిసిఎస్ లో  సిఐ గా పనిచేస్తున్న భుక్యా రాజు నాయక్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్. ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ఉత్తర్వులు వెలువడ్డాయి.. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వివాహిత. ఇప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్. వివాహిత ఇచ్చిన ఫిర్యాదులో ఫోన్ నెంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్ లో మాటలు కలిపి లవ్ చేస్తున్నాను ,పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి వివాహితను లోబర్చుకున్న సీఐ. గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు. ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ ..ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 7న ఫిర్యాదు చేసిన బాధితులు. పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు పరారీలో సిఐ. శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతో వెలుగులోకి వచ్చింది..

More articles

Latest article