27.2 C
Hyderabad

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థి సాత్విక్ ను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఒలంపియాడ్ సైన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాత్విక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి పాఠశాల విద్యతో పాటు ఇతర సబ్జెక్టుల విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే క్రీడల్లోనూ తర్ఫీదు పొందాలని సూచించారు. వేసవి సెలవులను వృధా చేయకుండా ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో శిక్షణ పొందాలన్నారు. పేద విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సాత్విక్ ఉత్తమ ప్రతిభను కనబరచడం సంతోషంగా ఉందన్నారు.

More articles

Latest article