30.9 C
Hyderabad
Monday, August 3, 2026

టాస్క్ ఫోర్స్ కార్యాలయం ఎదుట పేకాట

Must read

📰 Generate e-Paper Clip

  •  పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ – నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యలయం ఎదుట పేకాట స్థావరంపై పోలీసులు దాడి జరిపారు. పలువురు జూదం ఆడుతున్నారనే సమాచారంతో సీసీఎస్ ఏసిపి, ఇంచార్జ్ టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ఎదుట పేకాట స్థావరం పై దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి దాడులు జరిపారు. జూదం ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేలు సీజ్ చేశారు. నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

More articles

Latest article