26.6 C
Hyderabad
Monday, August 3, 2026

Must read

📰 Generate e-Paper Clip

  • 91 మంది సిబ్బందికి స్థానచలనం
  • కొత్తగా ఏర్పడిన పిఎస్ ల సిబ్బందికి మూకుమ్మడి బదిలీ
  •  అవినీతి ప్రక్షాళన కొరకే బదిలీ

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలో భారీగా సిబ్బందిని బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన కోసం మూకుమ్మడిగా ఒకే రోజు 91 మంది సిబ్బందిని పరిపాలన సౌలభ్యం పేరిట స్థానచలనం కలిగించారు. ప్రధానంగా దశాబ్ద కాలంలో ఏర్పడిన కొత్త పోలీస్ స్టేషన్ లలో అవి స్థాపించినప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి స్థానాచలనం కలిగించారు. జిల్లాలోని 73 మంది కానిస్టేబుళ్లు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 6 గురు ఏఎస్ఐలకు బదిలీ చేస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్సులో లాంగ్ స్టాండింగ్ గా పనిచేస్తున్న వారిని కదిలించారు. టాస్క్ ఫోర్సులో మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. సంబంధిత శాఖలో లాంగ్ స్టాండింగ్ గా ఉండి ఇల్లీగల్ దందాలు నిర్వహించే వారితోనే కనెక్షన్ ఉందన్న ఆరోపణల తోనే మూకుమ్మడిగా మొత్తం శాఖలో సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రధానంగా కోర్టు విధులు నిర్వహిస్తున్న వారికి కూడా బదిలీ చేశారు. కొత్త పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కాగా అక్కడ ఆరు సంవత్సరాల పైబడి పనిచేస్తున్న వారికి బదిలీల్లో చోటు కల్పించారు. ట్రాఫిక్ లోను సిబ్బందిని చాలా మటుకు కదిలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కల్మేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారీగా బదిలీలు జరగడం తొలిసారి.

More articles

Latest article