26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పీఎంజే జ్యూయలరీ షాపు చోరి గుట్టు విప్పిన పగిలిన సెల్ ఫోన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ముగ్గురు దొంగల ను అరెస్ట్ చేసిన పోలీసులు

. . . పరారీలోనే మాస్టర్ మైండ్ సుబోద్ సింగ్

. . . జూలాయి సినిమాను మించిన క్రైమ్ ప్లాన్ మిస్టరీ

 కరీంనగర్, బతుకమ్మ:

 

దొంగతనాలు, దోపిడీలు, మర్డర్ లు చేయడానికి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. కాని బీహార్ కు చెందిన సుబోధ్ సింగ్ అనే దోపిడీ దొంగతనాలు మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన మాత్రం తెలుగులో వచ్చిన ‘ జూలాయి ’ సినిమా చూసి కరీం నగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో చోరికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. జులాయి సినిమాలో బిట్టు గ్యాంగ్ లీడర్ ( సోనూసుద్) బ్యాంకుకు కన్నం వేయడానికి కొత్త వ్యక్తులను ఎంపిక చేస్తాడు. ఒక్కరికి ఒక్కరికి పరిచయం లేని వాళ్ళు ఎంపిక చేసి 1400 కోట్ల బ్యాంకు డబ్బులు దోచేస్తాడు. ఇప్పుడు అదే సీన్ ను రిపీట్ చేసి బీహార్ కు చెందిన సుబోధ్ అనే దొంగ… బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ , మహారాష్ట్రకు చెందిన కరుడు కట్టిన నేరస్థులను ఎంపిక  చేసి ఈ నెల 3న కరీంనగర్ జిల్లా కేంద్రంలో  పీఎంజే జ్యూవెల్లరీ షాపులో 11 నిమిషాల వ్యవధిలో 161 తులాల బంగారు ఆభరణాలు,61 క్యారట్ల వజ్రాలు చోరీ చేశారు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన వారిపై తుపాకులతో నాలుగు రౌండ్లు పైగా కాల్పులు జరిపి రెండు బైక్ లపై రాజీవ్ రహదారిపై పరారీ అయ్యారు..

Broken cell phone unravels mystery of theft at PMJ Jewelry shop

 

సీన్ కట్ చేస్తే ఈ నెల 3న కరీంనగర్ జిల్లా కేంద్రంలో PMJ జ్యూవెలర్స్ దోపిడి కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దోపిడీలో పాల్గొన్నముగ్గురిని అరెస్ట్ చేసి,  రూ.50 వేల నగధునురికవరీ చేశారు కరీంనగర్ పోలీసులు, ఈ దోపిడికి మాస్టర్‌మైండ్‌ గ్యాంగ్ లీడర్ బీహర్ కు చెందిన సుబోధ్ సింగ్‌ను గుర్తించారు. నిందితుల నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 10 మంది కోసం గాలిస్తున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు….

 

సిపి గౌస్ ఆలం కథనం ప్రకారం…..  బీహార్ కు చెందిన సుబోధ్ సింగ్ జైలులోనే నగల షాప్ లో చోరీకి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీలకు ఐదు రాష్ట్రాలకు చెందిన కరుడుగట్టిన వారిని ఎంపిక చేసి వారికి తుపాకులను, వాహనాలు సమకూర్చి పథకం అమలు చేశారు. ఈ దోపిడీ సీన్ లో ఉన్నట్టు 5 గురే కాకుండా మొత్తం 13 మంది తో మాస్టర్ మైండ్ సుబోద్ కలిసి చోరి చేశారు..పీఎంజే జ్యూవెలరీలో చోరీకి పాల్పడిన దొంగలు కరీంనగర్ జిల్లాపై పూర్తిగా పట్టున్నట్టు సందులు , గొందులు మీదుగా గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లా ధర్మపురి మీదుగా పరారీ అయ్యారు.  మూడు టీంలు కలిసి చోరి కి ప్లాన్ వేసి తరువాత పరారీ అయ్యారు..బుగ్గారం మండలం మద్ద నూరు  వద్ద చోరీ కేసుల నిందితులు తమవద్ధ ఉన్న ఆధారాలను చెరిపి వేసేందుకు నేలకేసి ఫోన్ ను బద్దలు కొట్టి పారేశారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులకు దొరికిన సెల్ ఫోన్ ముక్కలు.. అప్పటికే పీఎంజే జ్యూవెల్లరీ షాపులో చోరి ఘటనల వార్తలను చూసి స్థానికులు సెల్ ఫోన్ ముక్కలను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అప్పటికే 12 టీంలతో గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ పగిలిన ముక్కల ఆదారంగాఫోన్ పగిలిపోయిన అందులో డేటా కొంతవరకు రికవరీ చేయగలిగిన పోలీసులు.. అదే ఆధారంగా గ్యాంగ్ కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు అదుపులో ఉండగా.. మిగతా 10 మందిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో.. నిందితులు అన్ని ఆధారాలు చెరిపేయాలని ప్రయత్నించినా.. చివరకు ఒక పగిలిన ఫోన్‌నే వారి గుట్టు విప్పే కీలక ఆధారం గా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article