28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి కలెక్టరేట్ లో అలయ్ బలాయ్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: విజయదశమి పండుగ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నందున జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. రానున్న కాలంలో ఇదే పద్ధతిలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దసరా పండుగ నేపథ్యంలో జమ్మి ఆకులను కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి. పి. ఒ. రాజారాం, దయానంద్, టీఎన్జీవో అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, టీ.జి. ఒ. అధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Alai Balai in Kamareddy Collectorate

More articles

Latest article