25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డిప్యూటి సీఎంతో బేటి ఐన డిఎఫ్ఓ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ను నిజామాబాద్ డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రం సింగ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటి సీఎంను కలిసారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ సంరక్షణ, పర్యావరణ పునరుద్ధరణ, పర్యావరణ పర్యాటక అభివృద్ధి, పట్టణ పచ్చదనం, సుస్థిర జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అటవీ సంరక్షణను బలోపేతం చేయడం, పట్టణ పార్కులను మెరుగుపరచడం, జీవవైవిధ్య సంరక్షణను పెంపొందించడం, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, జిల్లాలో పర్యావరణ పర్యాటక అవకాశాలను అన్వేషించడం వంటి దిశగా అటవీ శాఖ చేపడుతున్న ప్రయత్నాల గురించి డిఎఫ్ఓ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

More articles

Latest article