28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూ తో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ సంస్థ ఒప్పందం

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

స్కిల్ డిజైన్ టెక్నాలజీస్, ప్రై. లిమిటెడ్ – హైదరాబాద్ వారు తెలంగాణ విశ్వవిద్యాలయంతో  ఎంఓయు కుదుర్చుకున్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి.యాదగిరిరావు సమక్షంలో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి లు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్, ఇంటెన్షిప్, మూక్స్ లలో ఆసక్తికర విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలు విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article