29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎండలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

చేతనైనంతవరకు అవసరంలో ఉన్న వారి ఆకలి తీర్చడం ప్రధాన లక్ష్యమని వివేకానంద జిల్లా అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్, మాజీ సెక్రటరీ (20092026), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి అన్నారు. బుధవారం తీవ్ర ఎండలో ఆకలితో అలమటిస్తున్న పేద సోదరులు, సోదరీమణులకు ఆయన ఆహారాన్ని పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవఅనే భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని రూపేష్ రెడ్డి తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో పవన్, తదితరులు పాల్గొన్నారు.

Food distribution to those starving in the sun

More articles

Latest article