26.6 C
Hyderabad
Monday, August 3, 2026

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

 

The welfare of farmers is the main goal of the government.

 

రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, ఇది ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుతుందని అన్నారు. ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఈ పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తున్నదన్నారు.

 

The welfare of farmers is the main goal of the government.

 

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాయికుమార్, గీతారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, బోధన్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారావు, బోధన్ కమిటీ డైరెక్టర్లు, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, ఏవో సిద్ధిరామేశ్వర్, సర్పంచులు కందగట్ల రామచందర్, రాజు గౌడ్, సాయిలు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు, పలు గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article