27.1 C
Hyderabad

దత్తత, పోస్టర్ కేర్ పై అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పెషలైజ్డ్ అడాప్షన్ ఎజెన్సి లో గురువారం పిల్లల దత్తత కొరకు దరఖాస్తు చేసుకున్న తల్లి దండ్రులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన జిల్లా సంక్షేమ అదికారి పద్మ హాజరై దత్తత తీసుకోబోయే తల్లి దండ్రులతో దత్తత నియమ నిబందనల గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పోస్టర్ కేర్ గురించి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల పైన పిల్లలు దత్తత వెళ్లలేని పరిస్థితిలో ఉంటే పోస్టర్ కేర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు కుటుంబంలో పెరగాలని, దీనివల్ల సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుంటారని, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పోస్టర్ కేర్ తీసుకోవడానికి కుటుంబాలు ముందుకు రావాలని కోరారు. పిల్లలను ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిశు గృహం మేనేజర్ అనిత, సోషల్ వర్కర్ అనిల్, డిసిపియు చైల్డ్ లైన్ సిబ్బంది, దత్తత కు దరఖాస్తు చేసిన దంపతులు పాల్గొన్నారు.

 

Awareness program on adoption and foster care

More articles

Latest article