27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్టు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆదివారం భిక్కనూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై సుమారు 70 నుండి 80 సంవత్సరాలు వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆయన తెలిపారు. మృతుడి శరీరంపై కాషాయం కలర్ చొక్కా ధరించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు 8712658614 ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

More articles

Latest article