29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళల భద్రత సామాజిక బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

మహిళల హక్కుల రక్షణ, బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలంగాణ యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ జి.రాంబాబు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యక్షతన పి.ఓ.ఎస్.హెచ్ (ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హరాజ్మెంట్) ఆధ్వర్యంలో డిచ్ పల్లి సబ్ ఇన్స్ పెక్టర్ మహమ్మద్ ఆరిఫ్, స్టేషన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ చార్జ్ నిర్మల జ్యోతి హాజరై మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరిఫ్ మాట్లాడుతూ పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత రైడ్రెసల్ సెల్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక, వివిధ విభాగాల టీచింగ్, నాన్ టీచింగ్ మహిళా ఉద్యోగులు హాజరయ్యారు.

More articles

Latest article