నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ ప్రేమ్ సింగ్, సర్దార్ వామన్ సింగ్ వర్ధంతి సందర్భంగా వారి మనవళ్లు గాంధీ చౌక్ లోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో వారిరువురి పాత్రను గుర్తు చేసకున్నారు. కార్యక్రమంలో అమిత్ సింగ్, హరిపాల్ సింగ్, జగమేత్ సింగ్, జస్ పాల్ సింగ్, సుక్విందర్ సింగ్, కరంజోత్ సింగ్, మిథున్ సింగ్, దిల్ రాజ్, గబ్బర్ సింగ్, భగత్ సింగ్, కుల్దీప్ సింగ్, గురుద్వారా చైర్మన్ బల్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

