29 C
Hyderabad
Monday, August 3, 2026

లబ్ధిదారులకు బీమా యోజన చెక్కుల అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద ఇద్దరు లబ్ధిదారులకు వచ్చిన చెక్కులను మంగళవారం బ్యాంక్ మేనేజర్ శ్రీ విద్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు లో రెండు రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీవనజ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి రూ.436 చెల్లించాల్సి ఉంటుందని, ప్రమాద బీమా సురక్ష బీమా యోజన కింద రూ.20 చెల్లిస్తే ప్రమాద బీమా ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కూరి నారాయణ, విట్టాలేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు చిదుర వీరేశం, బ్యాంకు మిత్ర ఈ. నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ ఎస్. శ్రేయ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article