27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ట్రాఫిక్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి అవసరమైన కూలింగ్ గ్లాసులు, యూనిఫామ్ ఆర్టికల్స్‌ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలయం నుంచి అందిన ఈ సామాగ్రి ని సీపీ చేతుల మీదుగా మంగళవారం పోలీస్ సిబ్బందికి అందజేశారు. ట్రాఫిక్ డ్యూటీలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ సామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (ఏఆర్) రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ ధరణి కుమార్, వెల్ఫేర్ ఆర్.ఐ సతీష్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article