28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుకు ముందే తాజా, మాజీలు క్యూ కడుతున్నారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాదోడ్ బాబురావుకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. తాను ఉద్యోగిగా ఉన్న సమయంలో కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వారం రోజులు వైద్య శిబిరాలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు కవిత స్పూర్తితోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఈ నెల 25న తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుకు శ్రీకారం జరుగనుంది. పార్టీ ఏర్పాటు వరకు చాల మంది తాజా, మాజీలు తనకు టచ్ లో ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇది వరకే ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి లో చేరికలు ప్రారంభమైనట్లు తెలిసింది.

 

Former Botha MLA Rathod Baburao joins Telangana Jagruti

More articles

Latest article