బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ టీమ్, స్థానిక బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రైడ్ చేపట్టారు. దాడి సందర్భంగా సివిల్ సప్లైస్ డీటీ హనుమాన్ పంచనామా నిర్వహించగా, రెండు ఆటోలు, ఒక లారీ నుండి పీడీఎస్ ధాన్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 144.2 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అక్రమంగా పడీఎస్ బియ్యం నిల్వ, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సీఐ వెంకటనారాయణ హెచ్చరించారు.
