28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నియామక పత్రం అందుకున్న నుడా చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

Nuda Chairman who received the letter of appointment

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ గా నియమితులైన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు శుక్రవారం హైదరాబాద్ లో నియామకపత్రాన్ని అందుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కేశ వేణు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కాంగ్రెస్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని వేణు అన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ కి ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article