బతుకమ్మ, పిట్లం : తొమ్మిది రోజులపాటు బతుకమ్మలను పేరించి తీరక పువ్వులతో పేరించి బతుకమ్మను ఆడి పాడి ఉత్సవంగా నిమజ్జనం చేసిన చివరి రోజున సద్దుల బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ కావడంతో భారీ ఎత్తున మహిళలు అలంకరించుకొని ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ కమిటీ సభ్యులు గడి ముందర ఏర్పాటు చేసిన డీజీలతో బతుకమ్మ నృత్యాలు చేస్తూ ప్రజలను అలరించాయి. పాతకాల పాటలను చప్పట్లతో ప్రతి ఒక మహిళలు ఉత్సవంగా ఆడి పాడారు. అనంతరం ఊర చెరువులో సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ చూడడానికి యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలోని ప్రతి కాలనీలో ఒక్కొక్క బతుకమ్మను తెచ్చి పాటలతో బతుకమ్మను నిమజ్జనం చేశారు.
