బోధన్, బతుకమ్మ :
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన విద్యార్థిని కే. సాత్విక అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక, ఎంపీసీ విభాగంలో మొత్తం 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్భుత విజయంతో కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు, సిబ్బంది, సహచర విద్యార్థులు సాత్వికను అభినందించారు. ఆమె కృషి, పట్టుదల వల్లే ఈ ఫలితం సాధ్యమైందని వారు ప్రశంసించారు.
