27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత మహాత్మ జ్యోతిబాపూలే అడుగుజాడల్లో నడవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ ఆరెటి రఘు

 

ఇందల్ వాయి, బతుకమ్మ

 

విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి విద్యార్థి పూలే ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సర్పంచ్ ఆరెటి రఘు అన్నారు. ఇందల్ వాయి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు చంద్రయాన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు, విద్యా విస్తరణకు చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఉప సర్పంచ్ సంజీవ్ గౌడ్, కిష్టయ్య, బాలయ్య, సతీష్, దత్తు, భూమయ్య, గంగాధర్, ఆశన్న, రాజగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article