. . . ఐదుగురి పై కేసు నమోదు
బాన్సువాడ, బతుకమ్మ :
ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాలుగో సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో పోషించలేక ఓ తల్లి తన 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు విక్రయించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొనుగోలు చేసిన వారిపై, విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామనికి చెందిన ఓ మహిళ తన 18 రోజుల ఆడ శిశువును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళ కు లక్ష రూపాయలకు అమ్మింది. నలుగురు అమ్మాయిలు పుట్టడంతో ఆడ పిల్లలను పోషించలేక 4 వ పాపను అమ్మినట్లు తల్లి తెలిపింది. ఈ విషయంలో ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు సిఐ తుల శ్రీధర్ తెలిపారు.
