24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎండలు అప్పుడే 40 డిగ్రీలా ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్ముందు ఏమిటో పరిస్థితి

 

. . . సూపర్ ఎల్ నీనో అంటున్న శాస్త్రవేత్తలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. గురువారం ఇందూర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఏప్రిల్ మొదటి వారం ముగిసి రెండో వారంలో అడుగుపెట్టే సమయంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోల్లూర్ లో 40.1 డిగ్రీల గరిష్ట, 22 డిగ్రీల కనీష్ట ఎండలు కొట్టినట్టు రికార్డులు నమోదయ్యాయి. మద్నూర్ మండలం మేనూర్ లో 40.0 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే వారం నుండి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని 42 డిగ్రీలు దాటుతాయని, మే రెండో వారంలో 45 డిగ్రీల అత్యదిక ఉష్ణొగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ పర్యవేక్షకులు డా.ప్రతాప్. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, సాదారణంగా ఈ సీజన్ లో జిల్లాలో ఏప్రిల్, మే నెలలో ఎక్కువ ఎండలు ఉంటాయని, అయితే ఈ సంవత్సరం వేసవి ప్రారంభం నుండే ఉష్ణొగ్రతలు పెరిగాయన్నారు. అడపదడపా అకాల వర్షాలు పడ్డప్పుడు మాత్రమే కాస్తా తగ్గుతాయాని, అయితే ఈ సిజన్ మొత్తం ఎండలు ఎక్కువగా ఉంటయన్నారు. గత 10 రోజులుగా మద్యాహ్నం 12 గంటల వరకే 35 నుంచి 36 డిగ్రీలు దాటుతున్నాయని, సాయంకాలం 4 గంటల వరకు 40 డిగ్రీలకు ఎండలు చేరుకుంటూన్నాయంటూన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై కారణం సూపర్ ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. జిల్లాలో గతంలో 46 డిగ్రీల అత్యధిక ఎండలు ఎక్కువగా అని రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది అత్యధికంగా 45 డిగ్రీల ఎండ దంచికొట్టింది. ఇప్పటికే చెరువులలో, చెలిమేలలో నీళ్లు అడుగంటాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోను ఇదే పరిస్థితి ఉంది. సూపర్ ఎల్ నీనో ప్రభావం తలుచుకుని ఇప్పటికే ప్రజలు భయపడుతున్నారు. ఎండలు ఈ సారి వాతవరణ చల్లదనం పరికరాలు అమ్మకాలు ఉపందుకోనున్నాయి.

is-the-sun-already-40-degrees

More articles

Latest article