. . . గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి
భిక్కనూరు, బతుకమ్మ :
ఇందిరమ్మ ఇంటితో పేదవారి కల సాకారం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందాకరణ్ రెడ్డి అన్నారు. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ళను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సారే అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల అన్నింటిని నెరవేర్చడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఇంటిని నాణ్యతతో నిర్మించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి రాజు, శ్రీరామ్ వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాజబాబు గౌడ్ నరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఎమ్మార్వో సునీత, మల్లాని ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
