30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామీణ మహిళలు అక్షరాస్యులుగా మారాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉల్లాస్ మహిళ వయోజన విద్యా పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ప్రాజెక్టు అధికారి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మహిళలు నిరక్షరాస్యత నుండి అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వ  ఉల్లాస్ వయోజన విద్య కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా ప్రాజెక్టు అధికారి సంధ్యారాణి అన్నారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఉల్లాస్ వయోజన విద్య పరీక్ష కేంద్రాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. విద్యను అభ్యసించి పరీక్ష రాస్తున్న వయోజన మహిళలతో మాట్లాడుతూ చదువుకు వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చదువుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం మాణిక్యం, సీసీలు సాయన్న, వెన్నెమురళి, పి ఓ ఏ లు సుమలత, లత, రూప, స్వరూప మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

Rural women should become literate.

More articles

Latest article